అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాని Narendra Modi ఇచ్చిన పొదుపు పిలుపుకు స్పందిస్తూ N. Chandrababu Naidu ప్రభుత్వం మంత్రులు ఆర్భాటాలకు దూరంగా ఉంటున్నారు. డిప్యూటీ సీఎం Pawan Kalyan, మంత్రి Nara Lokesh ఇప్పటికే కాన్వాయ్‌లలో కోత పెట్టగా, తాజాగా ఇతర మంత్రులు కూడా అదే బాటలో నడిచారు.
లోకేశ్ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు పలువురు మంత్రులు ఎస్కార్ట్ వాహనాలు లేకుండా ఒక్కో వాహనంలోనే సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రి Ponguru Narayana కూడా తన కాన్వాయ్‌ను సగానికి తగ్గించి కేవలం రెండు వాహనాలతో హాజరయ్యారు.










