ములుగు భూగర్భంలో ఏం దాగుంది..? తవ్వకాల్లో ఆశ్చర్యకర ఘటన

0
5

ములుగు జిల్లాలో సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు బయటపడటం సంచలనం సృష్టించింది.

ప్రహరీ గోడ పునాదుల కోసం తవ్వుతుండగా రాతి శిలలు, స్తంభాల అవశేషాలు కనిపించాయి. అదే సమయంలో భూగర్భం నుంచి భారీ నాగుపాములు బయటకు రావడంతో కార్మికులు భయంతో పనులు నిలిపివేశారు. ఈ కట్టడాలు కాకతీయుల కాలానికి చెందినవిగా స్థానికులు భావిస్తున్నారు. రామప్ప దేవాలయానికి సమీపంలో ఉండటంతో పురావస్తు శాఖకు సమాచారం అందించారు. నిపుణుల పరిశీలన పూర్తయ్యే వరకు తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

-దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము…