మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.

0
3

శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భవన కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. బసినికొండ నిర్మితి కేంద్రం వద్ద రోడ్డు దాటుతుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది.

తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.