కువైట్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నారై టీడీపీ–జనసేన ఆత్మీయ విందు కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ రవి నాయుడు, రాజంపేట పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొన్నారు. గల్ఫ్‌లోని ప్రవాస భారతీయుల సమస్యలపై ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు కోడూరు వెంకట్, జనసేన కువైట్ అధ్యక్షుడు ఎర్రంశెట్టి హరి రాయల్‌తో కలిసి పలు అంశాలపై చర్చించారు. ప్రవాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అతిథులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన, యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









