పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ఎమ్మిగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి, నేతలు జగన్మోహన్ రెడ్డి, సురేంద్ర రెడ్డి నేతృత్వంలో ఎంపీడీఓ కార్యాలయం నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, మోకాళ్లపై కూర్చుని వినూత్నంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.










