Avja కృష్ణా
కొంత ప్రైవేటీకరణతోనే ఆర్టీసీకి ఊరట: ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి అని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ స్పష్టం చేశారూ … కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సబ్సిడీ ఇస్తున్నప్పటికీ, ఒక్కో బస్సు ధర సుమారు రూ. 1.60 కోట్ల నుండి రూ. 1.70 కోట్ల వరకు పలుకుతోందని తెలిపారు.
ఇంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి బస్సులను కొనుగోలు చేయడం ప్రస్తుతానికి ఆర్టీసీ లేదా ప్రభుత్వానికి సాధ్యం కాని పని అని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి బదులుగా బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తే, వారే పెట్టుబడులు పెట్టి, బాడీ బిల్డింగ్ చేయించుకుని బస్సులను నడుపుతారని, దీనివల్ల ఆర్టీసీపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని వివరించారు.
ఆర్థిక భారం.. ఎలక్ట్రిక్ బస్సుల ఆవశ్యకత
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 10వేల బస్సులు నడుస్తున్నాయని, వాటన్నింటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలంటే దాదాపు రూ. 15, వేల కోట్లు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ఆర్టీసీపై ఇప్పటికే ఆర్థిక భారం పెరిగిందని, ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆపరేటర్ల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు.
అయితే, ప్రయాణికులకు ఛార్జీలు పెంచే ఆలోచన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. డీజిల్ బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఖర్చు చాలా తక్కువని ఆయన వివరించారు
ఎలక్ట్రిక్ బస్సుల వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా, నిర్వహణ వ్యయం తగ్గి ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. రాబోయే రెండు నెలల్లో ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయనీ చెప్పారు










