మంచిర్యాల నియోజకవర్గం : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 07 వ డివిజన్ శ్రీరాంపూర్ లోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ మంచిర్యాల, జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ నివారణ కొరకు చేపట్టవలసిన జాగ్రత్తలపై అవగాహన కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్,డిప్యూటీ మేయర్ శ్రీమతి సళ్ళ రమ్య మహేష్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించరు,ఈ సందర్భంగా మేయర్ రానున్న వర్షాకాలం దృశ్య పలురకాల అంటూ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు,ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీ వేల్పుల రవీందర్,08 వ డివిజన్ కార్పొరేటర్ మేకల రాము ,జిల్లా వైద్యాధికారి అనితా, జిల్లా వైద్య శాఖ డాక్టర్లు,సిబ్బంది, ఆశ వర్కర్లు,స్థానిక కాంగ్రెస్ నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.










