నందిగామ మున్సిపాలిటీ 20వార్డులను 32 వార్డులుగా పునర్విభజన

0
3

ప్రభుత్వం వారి ఉత్తర్వులననుసరించి, కమీషనర్ & సంచాలకులు, పురపాలక శాఖ వారి ఆదేశానుసారం ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 32 వార్డులుగా పునర్విభజన చేపట్టి రూపొందించిన ముసాయిదా ప్రతులను పలు ప్రభుత్వ కార్యాలయములందు అనగా రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, తహశీల్దార్ వారి కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం.

తపాలా కార్యాలయం, ఉప ఖజానాధికారి కార్యాలయం మరియు పురపాలక సంఘ కార్యాలయం నందలి నోటీస్ బోర్డుల యందు ప్రదర్శించడమైనది మరియు సంబంధిత వార్డు పునర్విభజన ముసాయిదాపై ఏ విధమైన సూచనలు/ సూచనల ఉన్న యెడల ది 24-05-2026 సాయంత్రం 5.00 గంటల లోపు నందిగామ పురపాలక సంఘ కార్యాలయం నందు లిఖితపూర్వకంగా సమర్పించవలసిందిగా కమీషనర్ జి. లోవరాజు ఒక ప్రకటనలో కోరారు.