మంచిర్యాల 32 వ డివిజన్ లో పర్యటించిన మేయర్ : ధర్ని మధుకర్

0
3

మంచిర్యాల :మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు,32 వ డివిజన్ లో 50 లక్షల వ్యయం తొ చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని మరియు 4 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన డ్రైనేజీ

నిర్మాణం పనులను ఈ రోజు మేయర్ గారు స్థానికులతో కలిసి పరిశీలించారు,ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో అన్ని డివిజన్లలో గౌరవ మంచిర్యాల శాసనసభ్యుడు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆశీస్సులతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలియచేశారు,ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు 32 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపతీ తిరుపతి,యూత్ అధ్యక్షులు పిట్టల రవి ,32 వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు,స్థానిక ప్రజలు పాల్గొన్నరు.