సైబర్ నేరాలపై చిలకలగూడ పోలీసుల అవగాహన కార్యక్రమం

0
10

హైదరాబాద్లో సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు “జాగృతి హైదరాబాద్ – సురక్షిత హైదరాబాద్” కార్యక్రమంలో భాగంగా చిలకలగూడ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కట్ట మైసమ్మ గుడి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో గుర్తుతెలియని ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, APK ఫైల్స్ ఓపెన్ చేయరాదని సూచించారు.

బ్యాంక్ వివరాలు, OTPలు ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో చిలకలగూడ ఏసీపీ కే. శశాంక్ రెడ్డి, ఎస్ఐ రాకేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.