చిలుకూరు మండల కేంద్రంలో రాష్ట్ర క్యాబినెట్ ఏప్రిల్ 23, 2026 న తీసుకున్న నిర్ణయం ప్రకారం 908 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పాలక మండళ్ళను నియమించాలని నిర్ణయం తీసుకుంది .దీని ప్రకారం ప్రతి సహకార సంఘం లో 13 మంది సభ్యుల పేర్లను పాలక పార్టీ ,వ్యక్తులను అధ్యక్ష, డైరెక్టర్ పదవులో నామినేట్ చేసుకోవడo జరుగుతుందని ఇది రాజ్యాంగ విరుద్ధం .నామినేట్ వ్యవస్థకు పూర్తిస్థాయిచట్టబద్ధత లేదు. సంఘాలకు ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలనీ mro కి రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక సహకార సంఘాల కు ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది.










