ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి, ఆర్టీసీ సిబ్బంది ద్వారా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు అన్నమయ్య జిల్లా కలెక్టరుకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. పెండింగ్ డీఏలు, ఐఆర్ విడుదల చేయాలని, కొత్త బస్సులు కొనుగోలు చేసి సిబ్బందిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూనియన్ పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా చైర్మన్ పివీ బయ్యారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. వి రమణ, జిల్లా కార్యదర్శి బి. సాంబశివరెడ్డి పాల్గొన్నారు.










