నర్సంపేట టు వరంగల్ రహదారిపై ఉదయం ఘోర ప్రమాదం….!

0
7

భారత అవాజ్ న్యూస్: 19 మే రోజున ఉదయంరోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన దుగ్గొండి మండలంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. కాశిబుగ్గ పద్మనగరకు చెందిన వెల్దండి వరుణ్(33) కారులో నర్సంపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గిర్నిబావి సెంటర్లో అతడి కారు లారీని ఢీ కొట్టింది. దీంతో వరుణ్కు తీవ్ర గాయాలు కాగా, ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. వరుణ్ మృతితో కాశిబుగ్గలో విషాదఛాయలు అలముకున్నాయి. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము….