ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల: సత్యకుమార్

0
0

 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం కూటమి ప్రభుత్వం రూ. 919.13 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ విధానంలో భాగంగా ఈ నిధులను నేరుగా ఆసుపత్రుల ఖాతాల్లోకి జమ చేసినట్లు ఆయన వివరించారు.

వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 785 ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ నిధులు అందాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రైవేట్ ఆసుపత్రులకు మొత్తం రూ. 5,556 కోట్లను చెల్లించామని, బకాయిల చెల్లింపుల హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.