రూరల్ సీఐని కలిసిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
1

నందవరం సబ్ ఇన్స్పెక్టర్ (SI) పై చర్యలు తీసుకోవాలని వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI)కు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నందవరం మండలంలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ముఖ్యంగా కనకవీడు ఘటనలో టీడీపీ నాయకుల తప్పున్నప్పటికీ వైస్సార్సీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టారని, అలాగే మండలంలో అక్రమ ఇసుక, మట్టి తరలింపులు, బెల్ట్ షాపులపై ఎస్ఐ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. ఈ వ్యవహారశైలిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంత్ రెడ్డి, బసి రెడ్డి, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.