అన్నమయ్య జిల్లా కలికిరిలో భూ వివాదంలో బాధితులు మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో మంగళవారం తమ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ షమీ, అశ్వక్, తస్మియా తమ తండ్రి వల్లీ అహ్మద్‌కు చెందిన భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని, జిల్లా కలెక్టర్ భూమి తమదేనని నిర్ధారించి, తహసీల్దార్‌కు న్యాయం చేయాలని ఆదేశించినా రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు న్యాయం చేయలేదని బాధితులు వాపోయారు. ఈ సంఘటనపై కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.










