హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి ఘనంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు.
బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనాలు అందించగా, సీనియర్ నాయకులు కేకె (కే.కేశవరావు) తన ఆశీస్సులను అందజేశారు.
చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన గద్వాల విజయలక్ష్మికి రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఈ ప్రత్యేక కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.
శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, నవీన్ యాదవ్, మరియు దానం నాగేందర్ తదితరులు ఉన్నారు.
వీరందరి సమక్షంలో విజయలక్ష్మి నూతన బాధ్యతలను స్వీకరిస్తూ మహిళా సంక్షేమానికి, వారి హక్కుల రక్షణకు తన వంతు కృషి చేస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి మరియు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ….
గద్వాల విజయలక్ష్మి నాయకత్వంలో మహిళా కమిషన్ మరింత బలోపేతం అవుతుందని, మహిళల సమస్యల పరిష్కారంలో ఈ కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళల భద్రత, సాధికారత ధ్యేయంగా నూతన చైర్పర్సన్ ఆధ్వర్యంలో కమిషన్ సరికొత్త మైలురాళ్లను అందుకుంటుందని నేతలు ఈ సందర్భంగా కొనియాడారు.
#sidhumaroju










