ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం… జూన్ 15 నుంచి జులై 14 వరకు 46,397 మంది బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి సమగ్ర సర్వే నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో మరణించిన, నకిలీ, వలస వెళ్లిన అనర్హుల ఓట్లను తొలగించి, నిజమైన ఓటర్లకు రక్షణ కల్పిస్తారు.
సర్వే అనంతరం జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఆ తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలు, క్లెయిములను స్వీకరించి, పరిశీలించిన అనంతరం సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఇలాంటి సమగ్ర ఓటర్ల










