రాష్ట్రాభివృద్ధిలో కార్మికులు, యాజమాన్యాన్ని రెండు కళ్లలా భావిస్తూ ప్రభుత్వం సమతుల్యంగా ముందుకు సాగుతుందని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. ‘శ్రమ శక్తి, ఉత్తమ యాజమాన్య పురస్కారాలు-2026’ ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వం నిలిపివేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను పునరుద్ధరించామని… వివాహ కానుక, ప్రసూతి సహాయం కింద రూ.20,000 చొప్పున అందిస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కోసం “లేబర్ అడ్డాలు”, ఐదు నగరాల్లో ఆధునిక ఈఎస్ఐ ఆసుపత్రులు, రూ.250 కోట్లతో హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరిశ్రమల్లో “జీరో యాక్సిడెంట్స్” లక్ష్యంగా థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్లు నిర్వహిస్తామన్నారు.










