జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభం

0
5

కొమురం భీమ్ ఆసిపాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్

కొమురం భీం జిల్లాలో జూన్ 2న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.  ఇందిరమ్మ ఇండ్లు రెండవ విడతకు శ్రీకారం చుట్టునున్నారు ఈ నేపథ్యంలో బుధవారం సిర్పూర్ కాగజ్ నగర్ లోని దాదానగర్ ఎస్పియం గ్రౌండ్.ఎక్స్ ఎక్స్ రోడ్ వద్ద సభ స్థలాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.జూపల్లి కృష్ణారావు. పరిశీలించారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఎమ్మెల్సీ దండే విఠల్.మంచిర్యాల ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.బెల్లంపల్లి ఎమ్మెల్యే గడం వినోద్ తో కలిసి సభ ఏర్పాట్లు భద్రత ట్రాఫిక్ పార్కింగ్ ప్రజల రాకపోకలపై మంత్రులు.అధికారులతో సమీక్షించారు.సీఎం పర్యటనకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు.ఎస్పీ  ఆసిఫాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ.గారు.మాజీ డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు గారు.కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ సుల్తాన  వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు.నాయకులు.కార్యకర్తలు. పాల్గొన్నారు