మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు.

0
3

మదనపల్లె మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుంగనూరు మండలం బారాడపల్లికి చెందిన చైతన్య(27), గిరిజ(19) అనే దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. సొంత పనిపై మదనపల్లెకు వచ్చి తిరిగి వెళ్తుండగా, బసినికొండ బైపాస్ రోడ్డులో వారి బైక్‌ను టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.