ముంజలు ఆరగించిన చంద్రబాబు దంపతులు

0
4

కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఒక అరుదైన, ఆహ్లాదకరమైన క్షణాన్ని పంచుకున్నారు. రహదారి పక్కన తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద వారి వాహనాన్ని ఆపి, కారు దిగి స్వయంగా ముంజలను కొనుగోలు చేశారు. అక్కడే నిలబడి ఆప్యాయంగా తింటూ, ఆ కార్మికుడి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

సాక్షాత్తు సీఎం దంపతులు తన వద్దకు రావడంతో ఆ వ్యాపారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అరుదైన క్షణాన్ని చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ, “కల్తీ, కార్బైడ్ లేని మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటి ముంజలు” అంటూ ట్వీట్ చేశారు. ఈ నిరాడంబరతకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.