నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం.

0
6

అన్నమయ్య జిల్లా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్య కోసం నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ (NOS) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ & సాధికారిత అధికారి దామోదర్ రెడ్డి గురువారం తెలిపారు.

భారత ప్రభుత్వం సామాజిక న్యాయ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రపంచ టాప్-500 విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ చదువులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. అర్హులైన అభ్యర్థులు nosmsje.gov.in ద్వారా జూన్ 2, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.