తెనాలి మున్సిపల్ చైర్మన్ పీఠం– కైవసం.

0
1

దశాబ్దాల తెనాలి మున్సిపాలిటీ చరిత్రలో మొదటిసారిగా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న జనసేన పార్టీ అభ్యర్థి. వైసీపీ అభ్యర్థి మద్దాలి శేషాచలం పై 17180 ఓట్లు మెజారిటీతో గెలుపొందిన జనసేన అభ్యర్థి తోటకూర రమణారావు. మునిసిపాలిటీ చైర్మన్ స్థానానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 296  బ్యాలెట్ ఓట్లు పోలవగా, జనసేనకి 193 ఓట్లు వైయస్సార్సీపీకి 76 ఓట్లు, కాంగ్రెస్కు 8 ఓట్లు,బిఎస్పీకి 8 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థులకు 2 ఓట్లు వచ్చాయి. మరో 6 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. నోటాకు 3 ఓట్లు పోలయ్యాయి. మొత్తం బ్యాలెట్   91,270 ఓట్లను ప్రజలు వినియోగించుకున్నారు.వార్డులు మొత్తం 52,పోలింగ్ కేంద్రాలు 185, మొత్తం పోలింగ్ శాతం 58. 10 %, జనసేన చైర్మన్ అభ్యర్థి రమణారావుకు 51,020 ఓట్లు పోలవగా,వైయస్సార్సీపి అభ్యర్థి మద్దాలి శేషాచలం కు 33,927 ఓట్లు పోలయ్యాయి. వైఎస్ఆర్సిపి చైర్మన్ అభ్యర్థి మద్దాల శేషాచలం పై టిడిపి అభ్యర్థి తోటకూర రమణారావు గెలుపొందారు. గెలుపొందిన సందర్భంగా పార్టీ నాయకులు,వార్డు అభ్యర్థులు, ఉద్యోగ సిబ్బంది అభినందించారు.