ఏపీలో కొత్త జనాభా రాజకీయాలు – భవిష్యత్ ప్రణాళికా? రాజకీయ వ్యూహమా?

0
5

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ప్రకటించిన జనాభా ప్రోత్సాహక పథకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మూడో బిడ్డకు ₹30,000, నాలుగో బిడ్డకు ₹40,000 incentive ప్రకటించడంతో ప్రజల్లో పెద్ద చర్చ మొదలైంది. ఒకప్పుడు “జనాభా నియంత్రణ”పై దృష్టి పెట్టిన ప్రభుత్వాలు ఇప్పుడు ఎక్కువ పిల్లలను ప్రోత్సహించడం ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి.

భవిష్యత్తులో యువ జనాభా తగ్గిపోతుందనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీనిని రాజకీయ వ్యూహంగా విమర్శిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.