మదనపల్లె: పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లికార్జున్ న్యూరో అండ్ స్పైన్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అనూష, డాక్టర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కేరళ అడిషనల్ ఏడీజీపీ లక్ష్మణ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిన్నబాబు శ్రీరామ్, ఆర్టీసీ డీఎం లక్ష్మీనారాయణ హాజరయ్యారు.










