పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: ఎస్పీ.

0
3

అన్నమయ్య జిల్లా పోలీసు సిబ్బంది మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ గురువారం తెలిపారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో కార్యక్రమం ప్రారంభమైంది. మే 21 నుంచి 23 వరకు మదనపల్లి, రాయచోటి, పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో ఉదయం ధ్యాన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. ధ్యానం ద్వారా ఒత్తిడి తగ్గి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమని అధికారులు తెలిపారు.