కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
జిల్లాలో నకిలీపత్తి విత్తనాల అక్రమ రవాణా విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్న నేపథ్యంలో సిర్పూర్ యూ,పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 5.45 క్వింటళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు.శుక్రవారం సిర్పూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్సై విక్రం తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు వారి వద్ద నుంచి మొత్తం 68 కిలోల 152 ప్యాకెట్ల పత్తి విత్తనాలు లభించాయి.ఒక్కో ప్యాకెట్ లో సుమారు 450 గ్రాముల చొప్పున విత్తనాలు ఉండగా వాటిపై ప్రభుత్వ ఆమోదిత వివరాలు క్యూఆర్ కోడ్ హాలో గ్రామ్. లాట్ నెంబర్ వంటి గుర్తింపులు లేకపోవడం గమనించారు.దీంతో వెంటనే వ్యవసాయ శాఖ అధికారి ఆనందరావుకు సమాచారం అందించగా ఆయన పరిశీలించి వాటిని నకిలీ పత్తి విత్తనాలుగా నిర్ధారించారు. అనంతరం పంచనామ నిర్వహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ కేసు పై ఆసిఫాబాద్ సబ్ డివిజనల్ డిఎస్పి అశోక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టాగ గత రెండు నెలలుగా సిర్పూర్ మండల పరిధిలో సుమారు 6.75 క్వింటళ్ల నకిలీ పత్తి విత్తనాలను లాభాపేక్షణతో రైతులకు సరఫరా చేయాలని తీసుకురాగా నిందితుడు నైతం జంగు ఇంటి వద్ద మరో 1100 ప్యాకెట్లు 4.90 క్వింటళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకోగా మొత్తం 5.45 కింటాళ్ళ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం పరచుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు
కేసులో నిందితుల వివరాలు:
A1) మంగునాథ్ సుమంధరనాథ్ వయస్సు.64 సంవత్సరాలు.వృత్తి:వ్యాపారం నివాసం:జూనాపాని మధ్యప్రదేశ్ ప్రస్తుతం ఇంద్రవెల్లి అదిలాబాద్ జిల్లా.A2) నైతంజంగు S/o నానాజీ వయసు 40 సంవత్సరాలు వృత్తి: మేస్త్రి.నివాసం: సిర్పూర్ యూ, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా.
A1.A2 లను అరెస్టు చేసి రిమాండ్ పంపిస్తున్నట్లు తెలిపారు.ఈ నకిలీ విత్తనాలు పట్టుకోవడంలో కృషి చేసిన డిఎస్పి అశోక్ ఎస్సై విక్రమ్.కానిస్టేబుల్ నాగేంద్రబాబు. నాగేంద్ర లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభూత్వ అనుమతులు ఉన్నవిక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.నకిలీ విత్తనాల సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కి సమాచారం తెలియజేయాలని సూచించారు.








