పుంగనూరు పరిధిలో శుక్రవారం రోజున ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి ముల్బాగల్ కు వెళ్లే మార్గంలో ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దెబ్బతింది మరియు అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించగా, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.










