సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ORR హామీ ఏమైంది..?: ఎమ్మెల్యే ధన్‌పాల్ ప్రశ్న

0
3

ప్రెస్‌మీట్ హైలైట్ పాయింట్స్

నిజామాబాద్‌ అర్బన్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి… — ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా

 • రెండున్నరేళ్లు గడిచినా నిజామాబాద్ అర్బన్‌కు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు

 • కాంగ్రెస్‌లో పదవులే ముఖ్యం… ప్రజా సమస్యలు కాదు

 • ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌కు ORR… నిజామాబాద్‌కు ఎందుకు నిర్లక్ష్యం..?

 • ఫిబ్రవరిలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ORR హామీ ఏమైంది..?

• ప్రభుత్వం కాంగ్రెస్‌దే… PCC అధ్యక్షుడు జిల్లా వాసే… అయినా అభివృద్ధి శూన్యం

 • 52 KM ORR ప్రణాళిక YSR హయాంలోనే సిద్ధం… ఇప్పటికీ అమలు కాలేదు

• 11 KM బైపాస్ రోడ్డును 12 ఏళ్లుగా పూర్తి చేయకుండా నత్తనడకన కొనసాగిస్తున్నారు

 • 30 ఏళ్లుగా నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ అటకెక్కింది

 • స్టేడియం, కళాభారతి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు అసంపూర్తిగా మిగిలిపోయాయి

 • కేంద్రం నుంచి నిధులు వస్తున్నా… రాష్ట్రం వాటా విడుదల చేయడం లేదు

 • వచ్చే వారం సీఎంను కలుస్తాం… స్పందించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.