కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం జిల్లా జనరల్ సెక్రటరీగా షేక్ కలీమ్ నియామకం

0
1

🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్) : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) మైనారిటీ విభాగం జిల్లా జనరల్ సెక్రటరీగా శ్రీ షేక్ కలీమ్ నియమితులయ్యారు. జిల్లా మైనారిటీ చైర్మన్ అర్షద్ హుస్సేన్ జారీ చేసిన నియామక పత్రాన్ని ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ గారితో కలిసి ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా షేక్ కలీమ్ మాట్లాడుతూ. తన నియామకానికి సహకరించిన డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇన్‌చార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు, జిల్లా మైనారిటీ చైర్మన్ అర్షద్ హుస్సేన్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, మైనారిటీ వర్గాల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.