ఆసిఫాబాద్‌లో ఘనంగా ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీ

0
2

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్  ప్రతినిధి జగదీష్:

ఆసిఫాబాద్, మే 25: ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం పట్టణంలోని 18వ వార్డులో అర్హులైన మహిళలకు ‘ఇందిరా మహిళా శక్తి’ చీరలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) దత్తాత్రేయ, మున్సిపల్ చైర్మన్ ఆకాష్ వైస్ చైర్మన్ హైమద్ గారు హజరై మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసమే ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని, మహిళలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ కస్తూరి పుష్పలత, 11వ వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్, 5వ వార్డు కౌన్సిలర్ స్వప్న రాణి, 19వ వార్డ్ కౌన్సిలర్ నాగుబాయ్ మరియు మున్సిపల్ సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు