“గోమాత” ను గౌరవిద్దాం – సామరస్యాన్ని కాపాడుదాం….!

0
2

_బక్రీద్ రోజు ఆవుల కుర్బానీ వద్దు, మేకలు-గొర్రెలతోనే త్యాగం చేద్దాం. ముస్లిం సోదరులకు విజ్ఞప్తి_

: జర్నలిస్టు ఖుద్ధుస్ ఖాన్

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ :

_ఈ నెల 28న జరుపుకోనున్న పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా నందిగామ డివిజన్ జర్నలిస్టు ఖుద్ధుస్ ఖాన్ ముస్లిం సోదరులకు సోషల్ మీడియా ద్వారా బహిరంగ విజ్ఞప్తి చేశారు._

ఖుర్బానీ కోసం దయచేసి ఆవులను కొనవద్దు. మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను కొని ఖుర్బానీ ఇవ్వండి. మన హిందూ సోదరులు ఆవులను తల్లిగా, గోమాతగా పూజిస్తారు. వారి మనోభావాలను మనం గౌరవించి మత సామరస్యానికి పాటుపడదాo అని ఆయన కోరారు.

త్యాగానికి అసలైన అర్థం:

బక్రీద్ అంటేనే త్యాగానికి ప్రతీక. ఆ త్యాగం జంతువును వధించడంలోనే కాదు, మన సాటి సోదరుల మనోభావాలను గౌరవించడంలోనూ ఉంది. మనం హిందూ సోదరులను గౌరవించడమే అసలైన త్యాగం అని అన్నారు_

ఒక మతం వారు పవిత్రంగా భావించే దాన్ని మరో మతం వారు గౌరవిస్తేనే దేశంలో ఐకమత్యం ఉంటుంది. ఇస్లాం కూడా ఇతర మతాలను, వారి ఆచారాలను గౌరవించమనే బోధిస్తుంది. దేశంలో శాంతి, సామరస్యం నెలకొనేందుకు అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని ఆయన పిలుపునిచ్చారు.