కార్యకర్త నుండి దేశస్థాయికి ఎదిగిన ఉపేందరుడు

0
3

మహబూబాబాద్ జిల్లా గోపాలపురం గ్రామానికి చెందిన వట్టం ఉపేందర్ ‘తుడుందెబ్బ’ (ఆదివాసి హక్కుల పోరాట సమితి) జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలోని చైతన్య యువజన సంఘం ద్వారా తొలి అడుగులు వేసిన ఆయన, ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుండి దేశస్థాయి అత్యున్నత పదవికి ఎదిగారు.

పోడు భూముల సమస్య, 1/70 చట్టం అమలు, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆయన ఎన్నో వీరోచిత పోరాటాలు చేశారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి స్వగ్రామానికి విచ్చేసిన ఉపేందర్‌కు గ్రామస్థులు, గిరిజన నాయకులు బ్రహ్మరథం పట్టి ఘనంగా సత్కరించారు. దేశవ్యాప్తంగా ఆదివాసీల హక్కుల పోరాటంలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.