నందిపేట్‌లో వీవో భవన నిర్మాణానికి భూమిపూజ

0
2

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 కార్యక్రమంలో భాగంగా నందిపేట్ గ్రామంలో మహిళల అభివృద్ధి కోసం నిర్మించనున్న గ్రామ సంఘం (వీవో బిల్డింగ్) భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఎర్రం లింగం గారు హాజరై భూమిపూజ నిర్వహించారు. అలాగే ఉప సర్పంచ్ చందర్, వార్డు సభ్యులు రిమ్మ రవి, కంతం చిన్నయ్య, చింత శ్రీనివాస్, భాస్కర్ పాల్గొన్నారు.

 

కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం, సీసీలు, ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు ఈ గ్రామ సంఘం భవనం ఎంతో ఉపయోగపడుతుందని ప్రజాప్రతినిధులు తెలిపారు. గ్రామాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ భవనం కీలక పాత్ర పోషించనుంది.