నిజామాబాద్‌లో ఉచిత వైద్య శిబిరం

0
2

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌లోని శ్రీ వర్ధన్ హాస్పిటల్‌లో డాక్టర్ సృజిల్ బాబు తేడ్డు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ నగర మేయర్ దండు ఉమారాణి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి ఉచిత శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ శిబిరంలో పలువురు నగర ప్రజలు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు పొందారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.