ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుండి సోమవారం మొలకలదిన్నెలో ఎఫ్‌ఎఫ్‌సీ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరి సమక్షంలో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.










