గిరిజన కళా ప్రదర్శనలు అద్భుతం: కలెక్టర్

0
4

పోలవరం జిల్లాలో ప్రతిష్టాత్మక ‘రేలా’ గిరిజన సంస్కృతి ఉత్సవాలు రెండో రోజు అత్యంత వైభవంగా సాగాయి. కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకలు గิరిజన సంస్కృతి వైభవానికి అద్దం పట్టాయి. సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో జరిగే ఇలాంటి భారీ ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ అరుదైన వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుండి భారీగా గిరిజన తెగలు తరలివచ్చాయి.

రెండో రోజు గిరిజనులు తమ సంప్రదాయ పండుగలు, వివాహ వేడుకలు, పురాతన నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించారు. సంప్రదాయ వాయిద్యాల మోతలతో రంపచోడవరం ప్రాంతం మారుమోగిపోయింది. గిరిజన కళలను కాపాడేందుకు ప్రభుత్వం కల్పించిన ఈ వేదికపై నాలుగు రాష్ట్రాల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.