పుంగనూరు మండలం గోపిశెట్టిపల్లె గ్రామస్థులతో కలిసి సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌కు వచ్చిన రిటైర్డ్ డీఎస్పీ, టీడీపీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ బాబు, ఫ్యాక్టరీ పేరుతో రైతుల భూములను లాక్కోవద్దని కోరారు. రెవెన్యూ అధికారులు రైతుల భూములను స్వాధీనం చేసుకుంటామని బెదిరించడం అన్యాయమని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల భూములను రక్షించాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.










