పాము కాటుకు గురైన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గంట్యాడలో జరిగింది.మండలంలోని మోకాలుపాడుకు చెందిన లక్ష్మి ఈనెల 20తేదీన ఇంటి ఎదుట గడపలో నేలపై ఇద్దరి మనుమరాలతో కలిసి నిద్రించింది. ఈ సమయంలో ఆమెకు పాము కాటుకు గురవ్వగా కుటుంబీకులు 108లో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కుమారుడు శంకర్ ఫిర్యాదుతో ఏఎస్ఐ రమణ కేసు నమోదు చేశారు.
#Boiena Rajesh










