*గడువు జూలై 24 వరకు పొడిగింపు.. అర్హులంతా ఎస్‌ఆర్‌ఎఫ్ ఫారాలు తప్పనిసరిగా సమర్పించాలని పిలుపు*
రాయచోటి రూరల్ పరిధిలోని చెన్నముక్కపల్లె గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను టీడీపీ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయిలో జరుగుతున్న దరఖాస్తుల స్వీకరణ, ఫారాల పరిశీలన తదితర అంశాలను ఆయన పరిశీలించి సంబంధిత సిబ్బందితో మాట్లాడారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… ఎస్‌ఐఆర్ ప్రక్రియకు తొలుత ఈ నెల 14వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండగా, ప్రజలకు మరింత అవకాశం కల్పించేందుకు భారత ఎన్నికల సంఘం మరో 10 రోజుల పాటు గడువును పొడిగించిందని తెలిపారు. దీంతో ఈ నెల 24వ తేదీ వరకు ఎస్‌ఆర్‌ఎఫ్ ఫారాలను సమర్పించే అవకాశం ఉందన్నారు.ఇంకా ఎస్‌ఆర్‌ఎఫ్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా జూలై 24లోపు తమ ఫారాలను సమర్పించాలని గండికోట సుధాకర్ విజ్ఞప్తి చేశారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన పత్రాలతో దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










