మదనపల్లె: ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి రైతు మృతి.

0
5

మదనపల్లెలోని ఒక ఆసుపత్రిలో గురువారం ఆపరేషన్ వికటించి రైతు శ్రీనివాసులు నాయుడు (51) మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. రొంపిచర్ల మండలం వారణాసిపల్లికి చెందిన ఆయన వీపుపై గడ్డ రావడంతో చికిత్స కోసం మదనపల్లె ఆసుపత్రిలో బుధవారం ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ వికటించి పరిస్థితి విషమించడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.