‘ట్రోల్స్ కాదు, పెట్టుబడులే ఉద్యోగాలిస్తాయి’.. తమిళనాడు మంత్రికి లోకేశ్ కౌంటర్!

0
5

పెట్టుబడుల ఆకర్షణలో తమిళనాడుతో ఆంధ్రప్రదేశ్ గట్టిగా పోటీ పడుతుందని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. తమిళనాడులో పెట్టుబడుల అవకాశాలపై అక్కడి పరిశ్రమల మంత్రి కీర్తన ‘ఎక్స్’ వేదికగా పంచుకున్న వీడియోపై లోకేశ్ స్పందించారు.

రాష్ట్రాల అభివృద్ధి కోసం జరిగే ఈ పోటీ ఆరోగ్యకరమైనదని, ప్రధాని మోదీ కూడా దీనిని ప్రోత్సహిస్తారని ఆయన పేర్కొన్నారు. ట్రోల్స్ ఉద్యోగాలను సృష్టించలేవని, పెట్టుబడులు మాత్రమే ఉపాధి కల్పిస్తాయని హితవు పలికారు. తమ రాష్ట్రం తమిళనాడుకు గట్టి పోటీ ఇస్తుందని లోకేశ్ సవాల్ చేయగా, మంత్రి కీర్తన హుందాగా స్పందిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ట్వీట్ల సంభాషణ ద్వారా పెట్టుబడుల విషయంలో ఏపీ సిద్ధంగా ఉందనే సంకేతాలను లోకేశ్ పంపారు.