రామగుండం, గోదావరిఖని గనులలో పర్యటించిన సింగరేణి సి & ఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి

0
20

సింగరేణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్దప్రకాష్ జ్యోతి, ఐఏఎస్ శుక్రవారం రామగుండం-1 ఏరియాలోని జీడీకే-11 ఇంక్లైన్‌లో గని ఉద్యోగులు మరియు అధికారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంస్థ ప్రస్తుత పరిస్థితులు, బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత మరియు నాణ్యతను మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్మాణాత్మకంగా సూచనలు, అభిప్రాయాల మార్పిడి జరిగింది.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు చురుకుగా పాల్గొని సంస్థ యొక్క స్ఫూర్తిని, పారదర్శకతని, సమష్టి భావనని ప్రతిబింబించారు,ఈ సందర్భంగా గనిలో కొత్తగా ఏర్పాటు చేసిన మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను సీఎండీ సత్కరించి, వారి అంకితభావం మరియు సేవలను అభినందించారు.