కనాజిగూడలో కొత్త విద్యుత్ పోల్స్.|

0
11

“రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న స్తంభాల స్థానంలో కొత్త పోల్స్ ఏర్పాటు.. స్థానికుల్లో హర్షం”

మేడ్చల్ మల్కాజ్గిరి జులై 13: ఓల్డ్ ఆల్వాల్ పరిధిలోని కనాజిగూడ బస్తీలో రహదారి మధ్యలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పనులు పూర్తికావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

స్థానికుల సమస్యను గుర్తించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చొరవతో విద్యుత్ శాఖ స్పందించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేసినట్లు బస్తీవాసులు తెలిపారు. దీంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులు, పాదచారులకు ప్రమాదం తగ్గిందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అనిల్ కిషోర్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే బస్తీవాసులు నరేష్, అన్వర్, డేవిడ్, మధు, సురేష్, సుజాత, జమున, కలావతి తదితరులు హాజరయ్యారు.

#Sidhumaroju

Alwal