మదనపల్లె: తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యం-కలెక్టర్.

0
5

అన్నమయ్య జిల్లాలో తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యమని కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. మదనపల్లెలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.

జూన్ 15 నుండి జూలై 14 వరకు జిల్లావ్యాప్తంగా ఇంటింటి ఓటరు సర్వే నిర్వహిస్తామని చెప్పారు. 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, మరణించిన, వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు.