మదనపల్లె మండలం వెంకప్పకోటలో ‘ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు’ రెండవ విడత కార్యక్రమం శుక్రవారం జరిగింది. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జేసీ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
భూ సమస్యలు, పాస్ పుస్తకాలు, 22A సమస్యలను రెండు వారాల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.తొలి విడతలో ఆరుగురు రైతులకు వన్-బి పత్రాలు, ఒకరికి కొత్త రేషన్ కార్డును అందజేశారు.










