మహిళా సాధికారతకు టిడిపి మరో చారిత్రక అడుగు

0
5

మహిళా సాధికారతకు టీడీపీ చారిత్రక అడుగు: 33% రిజర్వేషన్‌పై డ్వాక్రా మహిళల హర్షం

మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనే టీడీపీ మహానాడు తీర్మానంపై మంగళగిరి మండలం నవులూరు, ఎర్రబాలెం ప్రాంతాల డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేశారు. నవులూరు టిడ్కో గృహ సముదాయంలో శనివారం నిర్వహించిన అభినందన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

టీడీపీ నేతలు ఆకుల జయసత్య, తమ్మిశెట్టి జానకీదేవి మాట్లాడుతూ.. నాడు ఎన్టీఆర్ ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే, నేడు చంద్రబాబు డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక బలం ఇచ్చారన్నారు. మంత్రి లోకేష్ ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మంగళగిరి మహిళలకు ఉపాధి, కుట్టు మిషన్లు అందించి ఆదుకుంటున్నారని కొనియాడారు. ఈ రిజర్వేషన్ నిర్ణయం దేశ రాజకీయాల్లో మహిళల పాత్రను మార్చనుందని మహిళలు ఆకాంక్షించారు.