పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడుకోలు

0
5

ఎన్టీఆర్ జిల్లాలో 14 మంది పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు

ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలం పాటు చిత్తశుద్ధితో సేవలందించి, పదవీ విరమణ పొందుతున్న 14 మంది పోలీస్ అధికారులకు శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. సిపి ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు అడ్మిన్ డిసిపి కె.జి.వి.సరిత (ఐపిఎస్) పదవీ విరమణ చేసిన అధికారులను శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు. ప్రజా సేవకే సమయాన్ని వినియోగించినందుకు శాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు. విశ్రాంత జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు