విద్యుత్ ఘాతం ప్రమాదటపు అంచుల్లో అజిత్ సింగ్ నగర్ ప్రజలు

0
4

విద్యుత్ ఘాతపు ప్రమాదపు అంచుల్లో సింగ్ నగర్ ప్రజలు: ఎన్.ఎస్.యు.ఐ.

విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో హై వోల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ రక్షణ కవచాలు (ప్రొటెక్షన్ ఫెన్సింగ్) లేకపోవడంపై నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.యు.ఐ.) స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను సందర్శించారు.

రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ ట్రాన్స్‌ఫార్మర్ల వల్ల చిన్నారులు, వాహనదారులు, మూగజీవాలు విద్యుత్ ఘాతానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అంతేకాక, స్పార్కింగ్ వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ప్రజల తరపున ఎన్.ఎస్.యు.ఐ. పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతుందని డిమాండ్ చేశారు